రోడ్డుపై గండిని పూడ్చిన ఆటో డ్రైవరన్న (వీడియో)

71பார்த்தது
రోడ్డుపై పడిన గండిని పూడ్చి ఓ ఆటో డ్రైవర్ తన ఉదారతను చాటుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు అశోక్ నగర్‌ నుంచి కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్లే రహదారిపై గండిపడింది. ఎవరూ పట్టించుకోకపోయినా ఓ ఆటో డ్రైవర్ మాత్రం గండిని పూడ్చాలని నిర్ణయించుకున్నాడు. తన ఆటోలో మట్టి, ఇటుకలు తెచ్చి గండిని పూడ్చాడు. దీనిపై స్థానికులు డ్రైవరన్నను ప్రశంసిస్తున్నారు.

தொடர்புடைய செய்தி