నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు: నటుడు గోవిందా(వీడియో)

52பார்த்தது
బాలీవుడ్‌ నటుడు, శివసేన నేత గోవిందా శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు, పోలీసులకు, మీడియాకు, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, మంగళవారం ప్రమాదవశాత్తు ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యి గోవిందాకు గాయమైన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி