టర్కీలో బుధవారం ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో 10 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంకారాలోని ఏవియేషన్ కంపెనీలో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపినట్లు టర్కీ దేశీయాంగ శాఖ మంత్రి అలీ వెల్లడించారు. అక్కడ బాంబు దాడి కూడా జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.