తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహించవద్దు అని ఆదేశాలు జారీ చేసిన కూడా ఒక పాఠశాల అవేమి పట్టించుకోకుండా పాఠశాలలు నిర్వహిస్తుంది అని విద్యార్థుల తల్లి తండ్రులు శనివారం తెలిపారు. విద్యాశాఖ అధికారులకు విషయం తెలిసిన కూడా వారు చూసి చూడనట్లు ఉన్నారు అని అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.