సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శ్రీ ఎర్రకేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం సోమవారం సందర్భంగా బ్రహ్మ సూత్రం ఉన్న శ్రీ ఎఱకేశ్వర స్వామివారికి తెల్లవారుజామున పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. నక్షత్ర హారతి, ధూప సేవలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో ఈశ్వరుడు భక్తులకు దివ్య దర్శనంలో దర్శనం ఇచ్చారు.