తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజుల మహేందర్ నల్లగొండ జిల్లాకు ఇన్ ఛార్జ్ గా నియామకమయ్యారు. గురువారం హైదరాబాద్ లోని మున్నూరు కాపు సంఘం అపెక్స్ కమిటీ సమావేశంలో బండి సంజయ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వద్దిరాజు రవిచంద్ర ఆదేశాల మేరకు చైర్మన్ పుట్టం పురుషోత్తం, మాజీ మంత్రి జోగు రామన్న, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, మీసాల చంద్రయ్యల చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు.