సూర్యాపేటలో ఇంటిపై పడిన పిడుగు

62பார்த்தது
సూర్యాపేటలో ఇంటిపై పడిన పిడుగు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భా రీ వర్షం కురుసింది. కాగా పట్టణంలోని తాళ్ల గడ్డ కు చెందిన లూనావత్ విజయ్ సింగ్ ఇంటిపై పిడుగు పడింది. ఆ ఇంట్లో 8 కుటుంబాలు నివసిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని స్థానికులు తెలిపారు. కానీ 11ఫ్యాన్లు, 3 టీవీ లు కాలిపోయాయని బాధితులు వాపోయారు. భారీ వర్షానికి పట్టణం లోని రోడ్లన్ని జలమయమయ్యాయి.

தொடர்புடைய செய்தி