నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో పెద్ద చెరువు నిండి సంపూర్ణంగా అలుగు పారుతుంది. సీపీఎం నేత బొంతుల చంద్రారెడ్డి అధ్వర్యంలో సీపీఎం బృందం పరిశీలించింది. కొన్ని సంవత్సరాల తర్వాత అలుగు పోయటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం బృందం, గ్రామ ప్రజలు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.