ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్’ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘స్టార్‌షిప్’ ఐదో ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు దశల (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్) ఈ భారీ రాకెట్‌లో తొలుత బూస్టర్ విజయవంతంగా భూమికి చేరుకుంది. లాంచ్‌ప్యాడ్ వద్దకే అది తిరిగి చేరుకోవడం విశేషం. దీన్ని చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా 'స్పేస్‌ఎక్స్' రూపొందించింది.