న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ల గప్తిల్ తన కెరీర్‌లో 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 13,463 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 77 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక గప్తిల్ చివరిగా 2022 సెప్టెంబర్‌లో తన చివరి వన్డే ఆడాడు.