తెలంగాణ అసెంబ్లీలో జరిగిన డీలిమిటేషన్ తీర్మానంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. చెన్నైలో లేవనెత్తిన ఆకాంక్ష హైదరాబాద్‌లో నెరవేరిందని స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఈ పంథాను మిగతా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయని స్టాలిన్ అన్నారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు.