ఇల్లు కూలిపోయిన వృద్ధురాలికి సహాయం చేసిన ఎమ్మెల్యే

57பார்த்தது
వేములవాడ మున్సిపల్ లో ఇటీవల విలీన గ్రామమైన తిప్పపూర్ లో వర్షానికి ఆదివారం గసికంటి ఎల్లవ్వ ఇల్లును కూలిపోయింది. దీంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తక్షణ సహాయం అందజేసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద అవ్వకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా కల్పించారు. అండగా ఉంటానని అన్నారు. వారి వెంట మున్సిపల్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది, స్థానిక నేతలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி