వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పుట్టిన రోజు నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో భాగస్వామ్యమవుతూ మరింత ప్రజాసేవలో ముందుకు సాగాలని, దానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.