సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం

79பார்த்தது
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో డ్రైడేలో భాగంగా మంగళవారం మున్సిపల్, వైద్య సిబ్బంది సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి నిల్వ ఉన్న నీటిని పారబోసి, దోమల లార్వా వృద్ధి చెందకుండా చూసుకోవాలని, ఇంటి యజమానులకు తెలిపారు. దోమలు వృద్ధి చెందుతే డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, రాబోవు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி