వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నంబరు ప్లేట్లు నిబంధనల మేరకు ఉండాలని, వాహనాలకు బ్లాక్ ఫిలిమ్ ఉంటే తొలగించాలన్నారు. నిబందలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను సెప్టెంబర్ 2లోపు మార్చుకోవాలని, లేనిచో 3 తేదీ నుండి ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.