పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మ చెరువు సమీపంలోని కట్ట మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్. రాజయ్య, ఆలయ కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శ్రీనివాస్, గండు రంగయ్య పాల్గొన్నారు.