యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని మంథని సీఐ రాజు గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధించారు. సీఐ మాట్లాడుతూ, యువత గంజాయి, గుట్కా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గుడుంబా, గంజాయి విక్రయించిన వారి సమాచారం ఉంటే డయల్ 100కు తెలియజేయాలని కోరారు.