ఎండలు తీవ్రతరం అవుతున్నాయని నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలోని 59 వార్డులకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, మెట్పల్లి, కోరుట్ల మున్సిపల్ కమిషనర్లు మోహన్ అల్లే మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.