ఉడిపి హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ
జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల గణేష్ భవన్ ఉడిపి హోటల్ లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష సోమవారం తనిఖీ చేశారు. ఆదివారం ఓ మహిళా కస్టమర్ కొనుగోలు చేసిన ఇడ్లిలో జెర్రీ కనిపించగా ఆమె ఉడిపి హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన అన్ని దిన పత్రికలు, ఛానల్లలో ప్రసారం అయ్యింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు నిర్వహిస్తున్నారు