రామడుగు మండలం వెలిచాల గ్రామం నుండి కొత్తపల్లి (కరీంనగర్) వెళ్లే దారిలోని వంతెన వద్ద కుంగిపోయి గుంతలు పడడంతో ప్రయాణికులకు రాక పోకలకు ప్రమాదకరంగా, ఇబ్బందిగా మారడంతో రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు బుధవారం మరమ్మత్తులు చేపించారు. మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, మాజీ రైతుబంధు సమితి సభ్యులు వీర్ల సంజీవరావు, ఉప సర్పంచ్ పూదరి వెంకటేష్ తదితరులు ఉన్నారు.