
కొడిమ్యాల: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని రైల్వేగేట్ వద్ద నిషేధిత గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అనుమానితులను తనిఖీలు చేశారు. గ్రామానికి చెందిన ఈదురి అశోక్ అనే వ్యక్తి దగ్గర 150గ్రాముల గంజాయిని గుర్తించి, పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్‌కు చెందిన షరీఫ్ అనే వ్యక్తి దగ్గర గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడని ఎస్సై సందీప్ శనివారం తెలిపారు.