చొప్పదండి: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గుమలాపూర్ గ్రామస్తులు

76பார்த்தது
చొప్పదండి: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గుమలాపూర్ గ్రామస్తులు
చొప్పదండి మండలం గుమలాపూర్ గ్రామస్తులు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన శివరాత్రి తిరుపతి తన కూతుర్లతో బైక్ పై వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉండగా గ్రామస్తులందరూ కలిసి లక్ష పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బత్తుల లక్ష్మీనారాయణ, మునగాల రాజేందర్, మండల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி