సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో వడ్లకొనుగోలు కేంద్రాన్ని ఎమ్మార్వో వెంకట్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ వడ్ల తేమ శాతం ప్రభుత్వం నిర్ణయించిన దానికి అనుగుణంగా సరిచేసుకోవాలని రైతులను కోరారు. దళారుల మాటలకు మోసపోయి దాన్యాన్ని అమ్ముకోవద్దని ఆయన రైతులకు సూచన చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ కింది స్థాయి అదికారులను అదేశించారు.