సామూహిక శక్తిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

345பார்த்தது
సామూహిక శక్తిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు 19వ శతాబ్దం చివరి దశకంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ ప్రారంభించారు. మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో మొదలుపెట్టిన ఈ ఉత్సవాలు దేశమంతటా విస్తరించాయి. గణపతి ఏ విధంగా తల్లిదండ్రులే ఈ విశ్వం అని భావించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి వరాలందుకున్నాడో అదేవిధంగా ప్రతి భారతీయుడు తన దేశాన్ని రక్షించుకోవాలని తిలక్ బోధించాడు. అందుకే జనంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లొ ఆధ్యాత్మిక జాతీయత, ధర్మరక్షణ, జాతి ఐక్యత, సంఘటిత శక్తి అనే అంశాలు బలంగా నాటుకున్నాయి. ఇంట్లో ఉన్న గణపతి వీధిలోకి వచ్చాడు. జాతీయ జనగణపతిగా రూపుదిద్దుకొన్నాడు. అంతవరకు ఇళ్ళల్లో, గుళ్ళల్లో జరిగే వినాయక చవితి పండగ ఒక్కసారిగా వీధికెక్కింది. గుడిలోని వినాయకుడు గుడి వెలుపలకు వచ్చేశాడు, పూజలందుకున్నాడు. గుడిలో మూల విగ్రహం, గుడి బయట ఉత్సవ విగ్రహం రెండూ పూజాపునస్కారాలకు నోచుకున్నప్పటికీ ఉత్సవ విగ్రహం అంగరంగ వైభోగాలను పొందడం ప్రారంభమైంది. ధూప దీప నైవేద్యాలు, అలంకారాలు అన్ని ఇన్నని కాదు. విద్యుత్ కాంతులతో ఆడంబరంగా గణపతి ఉత్సవాలు తొమ్మిది రోజులు వెలిగిపోవడం మొదలైంది. ప్రజల్లోని ఒక సామూహిక శక్తిగా గణపతి కనిపించడం ప్రారంభమైంది. దుబ్బాకలో నేడు పలువురు వీధిలో గణపతిని నిలబెట్టి పూజలు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி