తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి స్టార్ట్ మొదలైంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద బారులు తీరుతున్నాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.