23 వరకు నవోదయ దరఖాస్తు గడువు పెంపు

79பார்த்தது
23 వరకు నవోదయ దరఖాస్తు గడువు పెంపు
నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని కోరారు.

தொடர்புடைய செய்தி