శరవేగంగా కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు

61பார்த்தது
శరవేగంగా కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు
15 కోట్ల రూపాయల నిధులతో అమీన్పూర్ నుండి వాణి నగర్ వరకు నూతన రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి బుధవారం తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే అమీన్పూర్ నుండి వాణి నగర్ మీదుగా ఆర్టీసీ కాలనీ, పిజిఆర్ కాలనీ, మాధవపూర్ హిల్స్, తదితర కాలనీలకు నేరుగా రహదారి సౌకర్యం ఏర్పాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி