సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా భారీ వర్షం దాదాపు గంట పాటు కురిసింది. దీంతో వాహనదారులు సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. భారీ వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయంగా మారాయి.