పుల్కల్: పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వ ప్రోత్సాహం.. మంత్రి

62பார்த்தது
పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం తన వంతు ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యారంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி