గ్యాస్ సిలిండర్ పేలితే బాధితులకు ప్రభుత్వం భారీ నష్టపరిహారం లభిస్తుంది. ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున గరిష్టంగా రూ.50 లక్షలు అందుతాయి. గాయం అయితే చికిత్స కోసం రూ.2 లక్షల వరకు, ఆస్తి నష్టం జరిగితే రూ.2 లక్షల వరకు పరిహారం. ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత ఎఫ్‌ఐఆర్, గాయపడితే ఆస్పత్రి బిల్లులు, చనిపోతే పోస్టుమార్టం నివేదిక, డెత్ సర్టిఫికెట్ డీలర్‌కు అందజేయాలి.