వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.