రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అందులో భాగంగా రెండు కోట్ల రూపాయలతో పిఆర్ రోడ్డు నుండి నాను తండా వయా బాలయ్య తాండ బీటీ రోడ్డును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు.