
షాద్ నగర్: ప్రపంచ హీమోఫీలియా దినోత్సవ ర్యాలీ
హీమోఫీలియా ఎంతో ప్రమాదకరం అని షాద్ నగర్ డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఏప్రిల్ 17న ప్రపంచ హీమోఫీలియా దినం సందర్భంగా గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు యూపీహెచ్ సీ షాద్ నగర్ దగ్గర డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు ఏర్పాటు చేసిన ర్యాలీని డాక్టర్ వి. విజయలక్ష్మి ప్రారంభించారు.