అన్ని వర్గాల క్షేమం కోరే ప్రభుత్వం తమదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రహ్మణులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఇప్పుడు వాటికి సాయం రూ.10వేలకు పెంచామన్నారు. దీనివల్ల 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.