పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో ఈ నెల 15న నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖలను భారత నౌకా దళ అధికారులు ఆహ్వానించారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ని రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్‌బీర్‌సింగ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నేవీ అధికారులు వారిని కలిశారు.