వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధాకు టీడీపీ అధిష్టానం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో వంగవీటి రాధాకు పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. కానీ పార్టీలో ఆయన క్రియాశీలకంగా పని చేస్తున్నారు. దాంతో ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల రాధా ఇంటికి మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.