కొడుకు తో తల్లి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిక్కరే శర్వాణి(24), సురేశ్ భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. మంగళవారం శర్వాణి ఇంటికి తాళం వేసి బాబును తీసుకొని వెళ్లిపోయింది. శర్వాణి అన్నయ్య రామారావు ఆమెకు ఫోన్ చేయగా బాబుతో వెళ్లిపోతున్నానని, ఇక రానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. రామారావు చిలకలగూడ పిఎస్ లో గురువారం ఫిర్యాదు చేశారు.