మారేడ్పల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో బీటెక్ కళాశాల ఏర్పాటు కోసం సచివాలయంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ సమావేశమయ్యారు. సీఎం సూచనల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాల అందుబాటులోకి వచ్చే విధంగా పనులు వేగంగా చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.