కంటోన్మెంట్: డ్రైనేజీ లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం

79பார்த்தது
కంటోన్మెంట్: డ్రైనేజీ లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడో వార్డులో ఎమ్మెల్యే గణేశ్ అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. 7వ వార్డులోని లాల్మియా బస్తీలో ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ లైన్ సమస్య ఉందని, దాన్ని పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతన డ్రైనేజీ లైన్ పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி