మోండా మార్కెట్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ఆదివారం దుండగులు ధ్వంసం చేసినారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరాలు తెలుసుకున్నారు. నిన్నటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. విగ్రహం ధ్వంసం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. దోషులు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా శిక్షించాలి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.