త్వరలో బాక్స్ టైపు డ్రైనేజీ లైన్ నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు అల్వాల్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్లో కార్పొరేటర్ అధికారులతో కలిసి పర్యటించారు. పనులు చేపట్టే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పక్కాగా ప్రణాళికలు రూపొందించి త్వరగా పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే డ్రైనేజీ సమస్యలు ఉండవని అన్నారు.