కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ అన్నారు. బుధవారం సంజీవయ్య నగర్ లోని కమ్యూనిటీ హాల్లో లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 153 మందికి చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.