ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈసా, మూసీ నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉందని, అక్కడ గుజరాత్ లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం HYD వేదికగా ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'ను ప్రారంభించి మాట్లాడారు.