పంచాయతీలకు 7. 48 కోట్ల నిధులు విడుదల

55பார்த்தது
పంచాయతీలకు 7. 48 కోట్ల నిధులు విడుదల
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు 7. 48 కోట్లు మంజూరయ్యాయి. మూడు వేల జనాభా ఉన్న పంచాయతీలకు నిర్వహణ ఖర్చుల కింద నెలకు 50 వేలు, ఎనిమిది వేల మంది జనాభా ఉన్న పంచాయతీలకు 75 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు లక్ష చొప్పున విడుదల చేసింది. దీనిలో భాగంగా జిల్లాలోని 3, 116 మంది పంచాయతీ సిబ్బందికి 3. 13 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி