కాలనీల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం మార్నింగ్ వాక్ లో భాగంగా డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీలో రోడ్లు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు.