చైతన్యపురి డివిజన్ లోని సత్యనగర్ కాలనీ, కొత్తపేట డివిజన్ లోని జనప్రియ అవెన్యూ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ల వినతి మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆయా డివిజన్లలోని కాలనీలలో పర్యటించి వారితో సోమవారం సమావేశమయ్యారు. ఇండ్లు, అపార్ట్మెంట్ లు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్స్ లో ఉన్నాయని, మీ ఇండ్లు, అపార్ట్మెంట్ లు కూల్చివేయడం జరుగుతుందని ప్రచారం జరుగుతోందని కాలనీ వాసులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తంచేశారు.