త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తన చిరకాల మిత్రుడు చంపాపేట డివిజన్ రెడ్డిబస్తీకి చెందిన మందా సత్యనారాయణ రెడ్డి నివాసానికి వచ్చి సరదాగా గడిపారు. అనంతరం ఆయన సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రాగార్డెన్ నిర్వాహకులు మంద రాంచంద్రారెడ్డి, లక్ష్మి గార్డెన్ నిర్వాహకులు రమణారెడ్డి, నాయకులు సిల్వేరి అనిల్ కుమార్ పాల్గొన్నారు.