కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన గోరక్ష మహా పాదయాత్ర ఇటీవల నగరానికి చేరుకుంది. మంగళవారం వనస్థలిపురం ప్రశాంత్ నగర్లోని కనకదుర్గ దేవాలయంలో పలువురు బాలకృష్ణ గురుస్వామికి స్వాగతం పలికారు. బీఎన్ రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, గో రక్షక్ యాదగిరిరావు, ఆలయ చైర్మన్ భుజంగరెడ్డి, నాగేష్ గౌడ్, చంద్రకాంత్డ్, గోపాల్ రెడ్డి, శ్యాంకుమార్, చిన్నయాదవ్, పవన్ రెడ్డి , సురేష్ పాల్గొన్నారు.