రోడ్ల నిర్మాణాలకు చర్యలు: బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్

64பார்த்தது
రోడ్ల నిర్మాణాలకు చర్యలు: బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సామనగర్ లో రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన మంగళవారం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, ఏఈ నరేందర్ తో కలిసి కాలనీలో పర్యటించారు. వరద నీరు సాఫీగా పారేలా లెవల్స్ చూసి రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని త్వరలో ప్రణాళిక రూపొందించి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி