హైడ్రా విషయంలో ముందు అఖిల పక్షం సమావేశం నిర్వహించాలని ఇటీవల తాను కోరానని, సీఎం స్పందించి మీటింగ్ పెడతామని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో 3 నెలల నుంచి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారని, ఇదే అఖిల పక్షం సమావేశం 3 నెలల ముందే పెట్టి ఉంటే కూకట్‌పల్లిలో బుచ్చమ్మ చనిపోయేది కాదన్నారు.